అరవింద సమేతలో మరో హీరోయిన్

-

third heroine in aravinda sametha

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ అరవింద సమేత దసరా బరిలో దిగుతుంది. త్రివిక్రం డైరక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఇప్పటికే పూజా హెగ్దె, ఈషా రెబ్బ హీరోయిన్స్ గా నటిస్తున్నారని తెలుస్తుండగా సినిమాలో మరో హీరోయిన్ కూడా నటిస్తుందని తెలుస్తుంది. కన్నడ భామ మేఘ శ్రీ కూడా అరవింద సమేత సినిమాలో నటిస్తుందట. సినిమాలో కీలక సన్నివేశాల్లో ఆమె కనిపిస్తుందని తెలుస్తుంది.

third heroine in aravinda sametha

తెలుగులో ఇప్పటికే ఓ మై గాడ్, అనగనగా ఒక చిత్రం, ఖాకి సినిమాల్లో నటించిన మేఘా శ్రీ ఎన్.టి.ఆర్ సినిమాలో నటించి ప్రేక్షకుల మెప్పు పొందాలని చూస్తుంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో సూర్యదేవర రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న ఈ సినిమా ట్రైలర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రిలీజ్ చేస్తారని తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news