ఎలక్ట్రిక్ వాహనాలు కొనకపోతే.. పాఠశాలలు బంద్ చేసే బంద్ చేయాల్సి వస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి… డిల్లీలో తీవ్ర కాలుష్యంతో పాఠశాలలు బంద్ చేసే పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. హైదరాబాద్ & తెలంగాణలో అలాంటి పరిస్థితి రావద్దని ఈవి పాలసీ తెచ్చామని వెల్లడించారు. తెలంగాణ ఎలక్ట్రిక్ వాహనాలను విసృతంగా ప్రజలు వాడేలా ఈ పాలసీ ఉందని వివరించారు.
ఈవి వాహనాల పై రోడ్డు టాక్స్ రిజిస్ట్రేషన్ ఫీజు 100 శాతం మినహాయింపు ఇస్తున్నామన్నారు. ఇప్పటికే స్క్రాప్ పాలసీ తీసుకొచ్చాని గుర్తు చేశారు. కాలుష్యాన్ని తగ్గించాలంటే ప్రజలు 15 సంవత్సరాలు దాటిన వాహనాలు స్వచ్చందంగా స్క్రాప్ చెపించాలని కోరారు. హైబ్రిడ్ వాహనాల పై కూడా పన్ను రాయితీ పై ఆలోచిస్తున్నామన్నారు. ప్రజలు ఈవి వాహనాలు కొనండని కోరారు. రవాణా శాఖ ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు ఆదేశా లు కాలుష్యాన్ని వెదజల్లే వాహనాలపై కఠినంగా వ్యవహరించాలని పేర్కొన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్.