ఏపీకి గేమ్ ఛేంజర్ పోలవరం : సీఎం చంద్రబాబు

-

ఏపీకి గేమ్ ఛేంజర్ పోలవరం అని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తాజాగా ఆయన అసెంబ్లీలో సాగునీటి రంగం పై చర్చ సందర్భంగా మాట్లాడారు. నదుల అనుసంధానం జరిగితే నీటి సమస్య ఉండదని తెలిపారు. గతంలోనే పోలవరం కుడి కాలువ నిర్మాణం పూర్తి అయిందని తెలిపారు. గొదావరి, కృష్ణానదులను అనుసంధానం చేశామని తెలిపారు. కేంద్రం జలజీవన్ మిషన్ నిధులు ఇస్తుందని తెలిపారు. పరిశ్రమల అవసరానికి నీటిని సరఫరా చేస్తామని తెలిపారు. 

chandrababu

2019 నాటికి పోలవరం 70 శాతానికి పైగా పూర్తి అయింది. 2019లో ప్రభుత్వం మారింది. రివర్స్ ట్రేడింగ్ జరిగింది. పోలవరం ప్రాజెక్టు ముందుకు సాగలేదు. తమ ప్రభుత్వం 2019లో అధికారంలోకి వస్తే.. 2021లోపు పోలవరం ప్రాజెక్ట్ పూర్తి అయ్యేదని తెలిపారు. తమ ప్రభుత్వ హయాంలో రాయలసీమకు నీళ్లు ఇచ్చామని తెలిపారు. ఏడాదిలో పట్టిసీమను పూర్తి చేశామని తెలిపారు. ఒకే రోజు 32వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులను ప్రారంభించామని తెలిపారు. పోలవరం ఏపీకి జీవనాడి, వెన్నెముక అని తెలిపారు చంద్రబాబు.

Read more RELATED
Recommended to you

Latest news