ప్రయాణికులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది రైల్వే శాఖ. ఏకంగా 370 రైళ్లకు 1000 కొత్త జనరల్ బోగీలు ఏర్పాటు చేయనుందట రైల్వే శాఖ. దీంతో ప్రయాణికులకు భారీ ఊరట లభించనుంది. నవంబర్ నెలాఖరులోగా 370 రైళ్లకు అదనంగా 1000 జనరల్ బోగీలు ఏర్పాటు చేయనున్నారట. దీని వల్ల రోజుకు లక్ష మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
ఇప్పటికే కొన్ని రైళ్లకు 583 జనరల్ కోచ్‌లను అమర్చినట్లు తెలిపిన రైల్వే శాఖ… ఇప్పుడు ఏకంగా 370 రైళ్లకు 1000 కొత్త జనరల్ బోగీలు ఏర్పాటు చేయనుందట. రాబోయే రెండేళ్లలో 10 వేలకు పైగా కొత్త నాన్-ఏసీ జనరల్ కోచ్‌లను ఏర్పాటు చేయనుందని సమాచారం.