గలచర్ల ఘటన, గిరిజన రైతుల సమస్యలు, ఎన్నికల హామీలు అమలు చేయాలని ఈనెల 21న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో మహాధర్నాలో పాల్గొననున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా మానుకోట జిల్లాలో అధిక సంఖ్యలో గిరిజన రైతులు ఉన్నారని.. వారి సమస్యల పరిష్కారం కోసం మహాధర్నా నిర్వహిస్తున్నట్టు బీఆర్ఎస్ నేతలు పేర్కొంటున్నారు. మానుకోటలో నిర్వహించే మహాధర్నాకు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
తాజాగా డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రు నాయక్ కేటీఆర్ కి ఓపెన్ వార్నింగ్ ఇచ్చారు. రేపు మహబూబాబాద్ వస్తున్న.. కేటీఆర్ మీద రాళ్ళ దాడి చేసి అడ్డుకుంటాం అన్నారు. రేపు మహబూబాబాద్ తహశీల్దార్ కార్యాలయం వద్ద గిరిజన, దళిత, పేద రైతులపై కాంగ్రెస్ ప్రభుత్వ దమనకాండకు నిరసనగా నిర్వహిస్తున్న మహా ధర్నాలో పాల్గొననున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. హైదరాబాద్ నుంచి వచ్చే దారిలో కొందరు యువకులతో కాంగ్రెస్ శ్రేణులు రాళ్లతో దాడికి ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.