ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను అదానీ లంచాల కుంభకోణం కుదిపేస్తోంది. విద్యుత్ ఒప్పందాలు, గ్రీన్ ఎనర్జీ, పవర్ ప్రాజెక్టుల్లో అధిక లాభాలు పొందేందుకు దేశంలోని కీలక స్థాయి అధికారులకు రూ.2,100 కోట్లను లంచాలుగా అదానీ కంపెనీ ముట్టజెప్పిందని అమెరికాకు చెందిన ఓ ఏజెన్సీ నివేదికను విడుదల చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ స్కాం రిపోర్టును దేశాన్ని కుదిపేస్తోంది.
తాజాగా అదానీ స్కాంపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందిస్తూ.. అదానీ స్కాములో ప్రమేయం ఉన్న అధికారులు, వ్యక్తులు, రాజకీయనాయకులను శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇందులో అధికార పక్షమున్నా.. ప్రతిపక్షమున్నా అందరికీ ఒకేలా శిక్ష పడాలన్నారు.తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చాక అదానీ పెట్టుబడులపై ఓ లేడీ జర్నలిస్ట్ ప్రశ్నించగా.. ఆ స్కాములో ఎవరున్నా( సీఎం రేవంత్).. ఎవరైనా అరెస్టు చేయాల్సిందేనని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.ఈ వ్యవహారంలో కింగ్ పిన్ కేంద్రమే అని రాహుల్ ఆరోపించారు.
రేవంత్ రెడ్డి అయినా, ఎవరైనా.. అరెస్ట్ చెయ్యాల్సిందే
అదాని ప్రెస్ కాన్ఫరెన్స్లో రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణలో అదాని పెట్టుబడులపై లేడీ జర్నలిస్ట్ ప్రశ్న
ఈ వ్యవహారంలో ప్రమేయం ఉన్నవారిని అరెస్ట్ చేయాల్సిందేనన్న రాహుల్#RahulGandhi #AdaniGroup #AdaniBribe #AdaniScam… pic.twitter.com/xoXjfYmaVB
— Pulse News (@PulseNewsTelugu) November 21, 2024