కొండా సురేఖ పై కేటీఆర్ వేసిన 100 కోట్ల పరువు నష్ట దావా కేసులో సిటీ సివిల్ కోర్ట్ విచారణ జరిపింది. ఇప్పటికే కొండా సురేఖ కు నోటీసులు జారీ చేసింది. అయితే కొండ సురేఖ నాగార్జున పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసింది. ఆ తరువాత ట్విట్టర్ లో క్షమాపణ కోరుతూ పోస్ట్ చేసింది. ఇక ట్విట్టర్ లో మంత్రి కొండా సురేఖ పెట్టిన పోస్ట్ ను కోర్ట్ ముందు చదువు వినిపించారు. నా వ్యాఖ్యల పట్ల మీరు కానీ, మీ అభిమానులు కానీ మనస్తాపానికి గురైనట్లైతే బేషరతుగా నా వ్యాఖ్యలను పూర్తిగా ఉపసంహరించుకుంటున్నాను, అన్యద భావించవద్దు అని కొండా సురేఖ ట్విట్ చేసింది.
అయితే నాగార్జున తరుపు న్యాయవాది అశోక్ రెడ్డి. బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉండి ఇలాంటి కామెంట్స్ చేయడం సరైంది కాదు కచ్చితంగా కొండా సురేఖ క్రిమినల్ చర్యలకు అర్హురాలు. ఈ కామెంట్స్ వలన నాగార్జున కుటుంబం మానసికంగా ఎంతో కుంగిపోయారు అని వాదనలు వినిపించారు న్యాయవాది అశోక్ రెడ్డి.