ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో మరో సంచలన పరిణామం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలోనే వైసీపీ నేత, సినీ రచయిత పోసాని కృష్ణమురళి రాజకీయాలకు శాశ్వతంగా గుడ్ బై చెబుతున్నట్టు ప్రకటించారు. ఇక నుంచి పాలిటిక్స్ జోలికి వెళ్లబోనని ఆయన వెల్లడించారు. అలాగే రాజకీయాలపై కూడా ఎన్నడూ మాట్లాడబోనని స్టేట్ మెంట్ ఇచ్చారు. వైసీపీ నే కాదు.. ఇప్పటివరకు ఏ పార్టీలో కూడా తనకు సభ్యత్వం లేదని తెలిపారు. ఏ పార్టీని అయినా తాను సామాన్య ఓటర్ లాగే ప్రశ్నించానని.. మంచి చేస్తే వాళ్లకు సపోర్ట్ చేశానని తెలిపారు.
తన చివరి శ్వాస వరకు కుటుంబం కోసమే బతుకుతానని పోసాని కృష్ణ మురళి స్టేట్ మెంట్ ఇచ్చారు. వైసీపీ మద్దతుదారుడైన పోసాని పై ఇటీవలే ఏపీ సీఐడీ యువత ప్రతినిధి బండారు వంశీకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏపీ సీఐడీ అధికారులు ఆయనపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సెప్టెంబర్ నెలలో ఓ మీడియా సమావేశంలో సీఎం చంద్రబాబు వ్యక్తిత్వాన్ని కించపరిచేలా పోసాని మాట్లాడారని ఫిర్యాదు చేశారు. పోసాని పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు అయింది.