ఇవాళ అసెంబ్లీ కమిటీ హాల్‌లో పీఏసీ సభ్యత్వాలకు ఓటింగ్ జరుగనుంది. ఇవాళ ఏపీ అసెంబ్లీ సభ జరిగే సమయంలోనే బ్యాలెట్ పద్ధతిలో పోలింగ్ ఉంటుంది. టీడీపీ తరపున ఏడుగురు సభ్యలు.. నామినేషన్లు వేశారు. టీడీపీ తరపున శ్రీరాం రాజగోపాల్, బీవీ జయనాగేశ్వరరెడ్డి, ఆరిమిల్లి రాధాకృష్ణ, అశోక్‌రెడ్డి, బూర్ల రామాంజనేయులు, నక్కా ఆనంద్‌బాబు, కోళ్ల లలిత కుమారి నామినేషన్లు వేయడం జరిగింది. జనసేన తరపున పులవర్తి రామాంజనేయులు నామినేషన్ వేశారు.
బీజేపీ తరపున నామినేషన్ వేశారు విష్ణు కుమార్‌రాజు… పీఏసీ ఛైర్మన్‌గా జనసేన ఎమ్మెల్యే పులవర్తి ఎన్నికయ్యే అవకాశం ఉంది. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పులవర్తి రామాంజనేయులు… పీఏసీ ఛైర్మన్‌గా ఎన్నికయ్యే అవకాశం ఉంది. పీఎస్ యూ ఛైర్మన్‌గా కూన రవికుమార్ ఎన్నికయ్యే అవకాశం ఉంది. అంచనాల కమిటీ ఛైర్మన్‌గా వేగుళ్ల జోగేశ్వరరావు ఎన్నికయ్యే అవకాశం ఉంది.