మేడిగడ్డ తరహాలోనే రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కుప్ప కూలిందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడారు. నాడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కట్టిన నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ 70 ఏళ్లు గడిచినా నేటికి చెక్కు చెదరకుండా ఉందన్నారు. ప్రజా ధనాన్ని లూఠి చేసి కేసీఆర్ తన సొంత ఇంజనీరింగ్ తో కట్టిన మేడిగడ్డ ఏడాదికే కూలిందని కామెంట్ చేసారు.
పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఉమ్మడి నల్గొండ జిల్లా ఎడారిలా మారిందని ధ్వజమెత్తారు. తమ జిల్లాకు కేసీఆర్ కేసీఆర్ నిధులు మంజూరు చేయకుండా పగడితే.. ప్రజలకు తిరగబడి ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని బొంద పెట్టి కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించారని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులు తీర్చేందుకు పెండింగ్ ఉన్న మిషన్ భగీరథ పైపులైన్ల పనుల కోసం రూ.210 కోట్లతో పనులు ప్రారంభించామని తెలిపారు.