ఇవాళ రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ నిర్వహించనున్నారు. ఇందులో భాగంగానే… మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌కి సర్వం సిద్ధం అయింది. ఇవాళ ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు జరుగనుంది. 8:30 నుంచి ఈవీఎంల ఓట్లను లెక్కించనున్నారు అధికారులు. కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ భద్రత కట్టుదిట్టం చేశారు. ఇక అటు మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరిగింది.
ఇక అటు నేడు జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి.. ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం అవుతుంది.. జార్ఖండ్‌లో మొత్తం అసెంబ్లీ స్థానాలు 81 ఉండగా, మేజిక్ ఫిగర్ 41 గ ఉంది. నేడు వయనాడ్, నాందేడ్ లోక్‌సభ ఉప ఎన్నికల ఫలితాలు కూడా విడుదల కానున్నాయి.. వయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నిక బరిలో ప్రియాంకగాంధీ నిలిచారు.. తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటిచేసిన ప్రియాంక.. ఈ సారి గెలుస్తుందా.. లేదా అనేది చూడాలి.