Priyanka Gandhi leading in Wayanad: వయనాడ్‌లో ఆధిక్యంలో కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ ఉన్నారు. తొలి రౌండ్‌లో 3 వేల ఓట్లకు పైగా ఆధిక్యంలో ప్రియాంక గాంధీ ఉన్నారు. అటు వయనాడ్‌లో బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్..వెనకబడ్డారు. అయితే… వయనాడ్‌లో కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ,, బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్.. మధ్య కేవలం 3 వేల ఓట్ల తేడా మాత్రమే ఉంది.
అటు జార్ఖండ్‌లోని బర్హత్‌లో హేమంత్ సోరెన్ ముందంజలో ఉన్నారు. కొలబా స్థానంలో బీజేపీ అభ్యర్థి రాహుల్ నర్వేకర్.. బారామతిలో ఎన్‌సీపీ అభ్యర్థి అజిత్ పవార్.. కొప్రిలో ఏక్‌నాథ్ షిండే ఆధిక్యంలో ఉన్నారు. మహారాష్ట్రలో ఆధిక్యంలో ఎన్డీఏ కూటమి ఉంది.. బీజేపీ 80 స్థానాల్లో.. కాంగ్రెస్ 63 స్థానాల్లో.. ఇతరులు 3 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి.