వేములవాడ మండలం సంకపల్లిలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులు రూ. 15 లక్షలతో భూమి పూజ చేసారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ నిధులతో రాష్ట్రంలో సీసీ రహదారులు నేషనల్ హైవేల నిర్మాణాలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన నాటి నుంచి నేటి వరకు గ్రామపంచాయతీలకు , మున్సిపాలిటీలకు, కార్పొరేషన్లకు ఒక రూపాయి నిధులు కేటాయించలేదు. వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని ప్రసాదం స్కీమ్ లో చేర్చుతున్నాము.
ప్రసాదం స్కీం లో చేర్చుతుండడంతో హడావిడిగా ఆలయ అభివృద్ధికి శంకుస్థాపనలు చేసిన సీఎం.. రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి నిధులు కేటాయిస్తే సంతోషిస్తాను, స్వాగతిస్తాను. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నరేంద్ర మోదీ, కేంద్ర ప్రభుత్వాన్ని తిట్టి రాష్ట్రానికి నిధులు రాకుండా చేసింది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అదే తరహాలో వ్యవహరిస్తుంది. వేముల వాడకు రైల్వే లైన్ తీసుకొచ్చేది కేంద్ర ప్రభుత్వమే. తెలంగాణ ఎంపీలలో రాష్ట్రానికి అధిక నిధులు తీసుకొచ్చింది నేనే. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలుపై కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి సారించాలి అని బండి పేర్కొన్నారు.