జార్ఖండ్ నుంచి వీడియో కాన్ఫరెన్స్లో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పాల్గొన్నారు. సమగ్ర కుటుంబ సర్వేలో ఎలాంటి పొరపాట్లకు అవకాశం ఇవ్వరాదని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. డోర్ లాక్, వలసలు వారి వివరాలను సేకరించండని ఈ సందర్భంగా ఆదేశాలు ఇచ్చారు. రాంచీ నుంచి ఉన్నతాధికారులు, కలెక్టర్లతో సమగ్ర కుటుంబ సర్వే వీడియో కాన్ఫరెన్స్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఆదేశించారు. సమగ్ర సర్వే లో డేటా ఎంట్రీ దశ చాలా ముఖ్యమైనది.. ఎలాంటి పొరపాట్లకు అవకాశం ఇవ్వకండని కోరారు.
సర్వే దశలో పట్టణ ప్రాంతాల్లో డోర్ లాక్, ఇంటి వద్ద అందుబాటులో లేకపోవడం వంటి కొన్ని సమస్యలు తలెత్తేయీ కాబట్టి వారికి ఫోన్ కాల్ చేసి సర్వే గురించి తెలియజేయడం ద్వారా ఆ వివరాలను క్రమబద్ధకరించుకోవాలని, వారిని అందుబాటులో ఉండమని కోరాలని ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో వలసలు మొదలైన వారి వివరాలను జాగ్రత్తగా క్రమబద్దరీకరించుకోవాలి అని తెలిపారు. కొన్ని వసతి గృహాల్లో, రెసిడెన్షియల్ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కేసులు నమోదవుతున్నాయి. ఈ పాఠశాలలో ఆహారం మరియు పరిశుభ్రతపై అధికారులు తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క.