ఈగల్ టీంలో రాష్ట్రం లో ఉన్న 5 కోట్ల మంది సభ్యులే అని ఐజీ, ఈగల్ టీం ఇంచార్జి రవికృష్ణ
అన్నారు. అయితే యువత ఎక్కువగా గంజాయి బారిన పడుతున్నారు. తల్లితండ్రులు పిల్లలపై ప్రత్యెక దృష్టి పెడితే ఇంటి వద్ద గంజాయి తగ్గింది. త్వరలో గంజాయి వల్ల కలిగే నష్టం పాఠ్యాంశంగా పెట్టే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఏపీలో గంజాయి దొరుకుతుందన్న చెడ్డ పేరు రాష్ట్రం పై ఉంది. అల్లూరి సీతారామరాజు జిల్లా లో ఈగల్ టీంతో గంజాయి పూర్తిగా నిర్మూలిస్తాము. గంజాయి పై ఉక్కుపాదం మోపుతాం.
అలాగే గంజాయి కేసు లో దొరికితే ప్రభుత్వ పథకాలు రద్దు చేస్తాం. Ndpc చట్టం చాలా కఠినమైనది..కేసులు కూడా చాలా కఠినంగా పెడతాం. గంజాయి అక్రమ రవాణాలో ఎంతటి వారైన చర్యలు తప్పవు. పార్సిల్ సర్వీస్ పై ప్రత్యేక నిఘా పెడతాం. కాలేజీలో కూడా గంజాయి వల్ల కలిగించే నష్టం పై యువత లో అవగాహన కార్యక్రమలు నిర్వహిస్తాం. గంజాయి నిర్మూలిత రాష్ట్రం గా ఆంధ్ర ప్రదేశ్ నీ తీర్చిదిద్దుతాం అని రవికృష్ణ పేర్కొన్నారు.