ఫుడ్ పాయిజన్ వెనుక ఒక అదృశ్య శక్తి పనిచేస్తుంది : కొండా సురేఖ

-

సైకో రావు వాళ్ళ బ్యాచ్ ప్రజలకు లేని పోని అపోహలు కల్పిస్తున్నారు. రేవంత్ రెడ్డి పాలనను అడ్డుకోవాలని చూస్తున్నారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు రావాలని ప్రయత్నం చేస్తున్నారు అని మంత్రి కొండా సురేఖ అన్నారు. వాంకిడిలో చనిపోయిన విద్యార్థి కుటుంభంకు ఒక ఇందిరమ్మ ఇల్లు, ఒక ఉద్యోగం ఇస్తున్నాము. గురుకుల విద్యార్థిని మరణంను రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకోవాలని చూస్తున్నారు. మా ప్రభుత్వంలో ఇది మొదటి ఇన్సిడెంట్. చాలా బాధగా ఉంది. నిమ్స్ లో ఆ అమ్మాయికి స్పెషల్ ట్రీట్ మెంట్ ఇచ్చాము. కానీ ఆమె చనిపోయింది.

కానీ మీ ప్రభుత్వంలో ఎవరినైనా చనిపోతే ఆదుకున్నారా? అంత బాధ మీకు ఉంటే ఆ అమ్మాయి కుటుంభంకు ఒక కోటి రూపాయలు ఇవ్వండి. గత ప్రభుత్వంలో చాలా ఇన్సిడెంట్లు అయ్యాయి కానీ ఒక్క సారి కూడా అక్కడికి వెళ్ళలేదు. మా ప్రభుత్వంలో ఫుడ్ పాయిజన్ దగ్గరికి మేము వెళ్ళాము. ఘటనకు బాద్యులు అయిన అధికారులను కూడా సస్పెన్షన్ చేసాము. ఫుడ్ పాయిజన్ వెనుక ఒక అదృశ్య శక్తి పనిచేస్తుందని తెలిసింది. పూర్తి స్థాయి విచారణ చేస్తున్నాము. ప్రభుత్వంను నడవకుండా చేయాలని ఒక ప్రణాళికతో డ్రామాలు చేస్తున్నారు అని కొండా సురేఖ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news