కడపలో ఘోర ప్రమాదం జరిగింది. ఆటోను ఢీకొట్టింది ఓ ట్రావెల్స్ బస్సు. ఈ సంఘటన లో ఇద్దరు మృతి చెందారు. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. కడపలో ఆటోను ఢీకొట్టింది ట్రావెల్స్ బస్సు. ఈ సంఘటన లో ఇద్దరు మృతి చెందారు. కడప పొరుమామిళ్ళ సమీపంలోని కాలువ కట్ట సమీపంలో ఆటోను ఢీకొట్టింది ఆర్వీటి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.
దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు మృతి చెందారు. ఇక మరో ఇద్దరు పరిస్థితి విషమం గా ఉంది. నలుగురికి గాయాలు అయ్యాయి. మృతి చెందిన వారు రామేశ్వరం గ్రామానికి చెందిన రోశయ్య 55, అక్కల రెడ్డిపల్లి గ్రామానికి చెందిన సుబ్బయ్య ఆచారి 65 గా గుర్తించారు పోలీసులు. గాయపడ్డ వారిని పోరుమామిళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇక అటు ఆటోను ఢీ కొట్టిన తర్వాత చెట్టుని ఢీకొట్టింది ప్రైవేట్ బస్సు. ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.