ఏపీలో సైబర్ నేరాలకు పాల్పడుతున్న గ్యాంగ్ అరెస్టు..!

-

విజయనగరం జిల్లాలో సైబర్ నేరాలకు పాల్పడుతున్న ఆరుగురు నిందితులను అరెస్టు చేసారు వన్ టౌన్ పోలీసులు. అలాగే మరో ముగ్గురు కోసం గాలిస్తున్నారు. ఆ నిందుల బ్యాంక్ అకౌంట్స్ సీజ్ చేసారు. సకాలంలో స్పందించి లావాధేవులు జరుగుతున్న పది‌ లక్షలను బ్యాంక్ అధికారులతో సంప్రదింపు చేసి హోల్డ్ చేయించారు పోలీసులు. పది లక్షలు, తొమ్మిది‌లక్షల విలువ చేసే బంగారం, ఆరు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. దేశ వ్యాప్తంగా నెట్వర్క్ ఏర్పాటు చేసుకున్నా ఈ ముఠా పై లోతైన దర్యాప్తు సాగిస్తున్నామన్నారు పోలీసులు.

ఈ ఘటన పై విజయనగరం ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ.. డిజిటల్ అరెస్ట్ పేరు చెప్పి అమాయక వ్యక్తుల నుంచి పలువురు డబ్బు ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు. మీ పేరుతో డ్రగ్స్ సరఫరా అవుతున్నాయి అంటూ నిందితులు ఫోన్ కాల్ చేస్తారు. వెంటనే మీ అకౌంట్ లో ఉన్న డబ్బులు మాకు ట్రాన్స్ఫర్ చెయ్యాలంటూ ఓ 70 సంవత్సరాల వృద్దిరాలికు కాల్ చేసారు నింధుతులు. భయంతో తన అకౌంట్ లో ఉన్న 40 లక్షల 40 వేలు నిందులకు ట్రాన్స్ఫర్ చేసింది వృద్దరాలు. ఈ కేసులో శ్రీనగర్ లో ఒకరు.. పూణేలో నలుగురు నిందితులను అరెస్టు చేయడం జరిగింది. దేశ వ్యాప్తంగా ఇలాంటి నేరాలు జరుగుతున్నాయి. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు ఎస్పీ.

Read more RELATED
Recommended to you

Latest news