ఆరోగ్య ఉత్సవాలకు శ్రీకారం చుట్టిన సీఎం రేవంత్ రెడ్డి..!

-

ఆరోగ్య ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎన్టీఆర్ మార్గ్ లోని హెచ్ ఎండీఏ గ్రౌండ్స్ నుండి 213 అంబులెన్సు లను ప్రారంభించారు రేవంత్. 108 కోసం 136 ఆంబులెన్స్ లు, 102 కోసం 77 ఆంబులెన్స్ లకు జెండా ఊపారు సీఎం . అయితే ఈ కార్యక్రమం లో ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి దామోదర రాజ నరసింహ, హైద్రాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్.. ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా 16 నర్సింగ్ కళాశాలలను కూడా వర్చువల్ గా ప్రారంభించారు సీఎం రేవంత్. దీంతో ప్రభుత్వ నర్సింగ్ కళాశాల సంఖ్య 37 కి చేరింది. అలాగే 28 పారామెడికల్ కాలేజీలను వర్చువల్ గా ప్రారంభించిన సీఎం రేవంత్.. 32 మైత్రి ట్రాంజెండర్ క్లినిక్స్ లను కూడా ప్రారంభించారు. అలాగే 422 మంది అసిస్టెంట్ సివిల్ సర్జన్ లకు నియామక పత్రాలు అందజేసారు సీఎం రేవంత్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news