రంగారెడ్డి జిల్లాలో లారీ భీభత్సం సృష్టించింది. కూరగాయల వ్యాాపారుల పైకి లారీ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో పది మంది చిరు వ్యాపారులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. చేవెళ్ల మండలం ఆలూరు స్టేజీ వద్ద సోమవారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. విషయం తెలిసిన వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు సమాచారం. ప్రమాద సమయంలో మొత్తం 50 మందికి పైగా వ్యాపారులు రోడ్డు పై కూరగాయలు అమ్ముకుంటున్నట్టు సమాచారం.
“రోడ్డు మంజూరై సంవత్సరం గడుస్తున్నా పనులు మాత్రం మొదలు కాలేదు. చేవెళ్ల రోడ్డు గురించి ముందే హెచ్చరించినా లెక్క చేయని ప్రభుత్వం అప్పా నుంచి మాన్నెగూడ వరకు నాలుగు లైన్ల రోడ్డు మంజూరై ఏడాదిన్నర పైనే అవుతుంది కానీ రోడ్డు విస్తరణ పనులు ఇంకా మొదలు పెట్టలేదు”అని సబితా ఇంద్రారెడ్డి కుమారుడు పటోళ్ల కార్తీక్ రెడ్డి పేర్కొన్నారు.