తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు : మంత్రి పొన్నం

-

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నేటితో ఏడాది పూర్తయిన సందర్బంగా బీసీ,రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ‘ప్రజలకు ధన్యవాదాలు’ తెలిపారు. ఈ మేరకు మంగళవారం సోషల్ మీడియాలో వీడియోను పోస్టు చేశారు. ‘ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణలో తమ ప్రభుత్వం ఏర్పడి నేటికి ఏడాది పూర్తయ్యిందని, గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ను బలపరిచి గెలిపించిన ప్రజలందరికీ, రాష్ట్ర ప్రభుత్వ పాలనకు సహకరిస్తున్న వారికి కాంగ్రెస్ తరఫున ధన్యవాదాలు తెలియజేశారు.

ఉద్యమకారుడుగా,విద్యార్థి నాయకుడిగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనలో నా బాధ్యతను గుర్తించి, నన్ను గెలిపించిన హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది పాలనలో అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశామని, రాబోయే నాలుగేళ్లలో కూడా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజాస్వామ్య రక్షణకై కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ కార్యచరణ ఉండబోతోందని తెలిపారు. రాబోయే రోజుల్లోనూ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి, ప్రజాప్రభుత్వాన్ని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news