ఏపీలో సంచలనం సృష్టించిన ఇండియన్ ఆర్మీ కాలింగ్ అధినేత రమణ వ్యవహారంలో ఊహించని ట్విస్ట్ ఎదురైంది. రమణ ఆర్మీలో ఉద్యోగాలు పెట్టిస్తానని శ్రీకాకుళానికి చెందిన పలువురి నుంచి రూ.10లక్షలకు పైగా తీసుకుని వారిని మోసం చేశారని, ఉద్యోగాల గురించి ప్రశ్నించినందుకు బెల్టుతో విచక్షణా రహితంగా యువకులపై దాడి చేశారని కథనాలు వచ్చాయి. దానికి సంబంధించిన విజువల్స్ సైతం ఒక్కసారిగా వైరల్ అయ్యాయి.
అయితే, అందులో ఇండియన్ ఆర్మీ కాలింగ్ అధినేత రమణ తప్పు లేదని, తప్పంతా నాదేనని దెబ్బలు తిన్న బాధితుడు నవీన్ తాజాగా మీడియాకు స్టేట్మెంట్ ఇచ్చాడు.‘నన్ను కొట్టడంలో రమణ తప్పులేదు. ఇన్స్టిట్యూట్ నుంచి నేను చెప్పకుండా బయటకి వెళ్లడం వలన ఆయనకీ కోపం వచ్చి కొట్టారు.ఈ ఘటన గత ఏడాది డిసెంబర్ 28న జరిగింది.కొట్టడం తప్పే అయినా..అందులో నా తప్పు ఉంది.తమని రమణ సొంత సోదరుని లా చూసుకుంటాడని’ నవీన్ వెల్లడించారు.
నన్ను కొట్టడంలో ఇండియన్ ఆర్మీ కాలింగ్ అధినేత రమణ తప్పులేదని భాదితుడు నవీన్
ఇన్స్టిట్యూట్ నుంచి చెప్పకుండా బయటకి వెళ్లడం వలన ఆయనకీ కోపం వచ్చి తనను కొట్టారని భాదితుడు నవీన్
ఈ సంఘటన గత ఏడాది డిసెంబర్ 28 న జరిగిందని బాధితుడు నవీన్ తెలిపాడు.కొట్టడం తప్పే అయినా… అందులో నా… pic.twitter.com/4vftt3beq4
— ChotaNews (@ChotaNewsTelugu) December 6, 2024