ఆస్ట్రేలియాతో అడిలైడ్ వేదికగా జరుగుతున్న పింక్ బాల్ టెస్ట్ లో భారత జట్టు కష్టాలో పడింది. నిన్న కేవలం 180 పరుగులకే ఆల్ ఔట్ అయిన భారత జట్టు.. ఆసీస్ ను 337 పరుగుల వరకు చేరనిచ్చింది. దాంతో 157 పరుగులు వెనకబడిన భారత జట్టు రెండో ఇన్నింగ్స్ లో ఏదైనా అద్భుతం చేస్తుంది అనుకుంటే.. ఆసీస్ బౌలర్ల ముందు మన టాప్ ఆర్డర్ బ్యాటర్స్ చేతులెతేశారు.
రెండో రోజు ఆట ముగిసే సమయానికి 24 ఓవర్లు బ్యాటింగ్ చేసిన టీమిండియా 128 పరుగులు చేసి 5 వికెట్లు కోల్పోయింది. పరుగులు వేగంగా రాబటినా కీలక ఆటగాళ్లు అందరూ పెవిలియన్ చేరుకున్నారు. ఇక ప్రస్తుతం క్రీజులో రిషబ్ పంత్(28), నితీష్ కుమార్ రెడ్డి(15) తో ఉన్నారు. అయితే రేపు మూడో రోజు ఆట ప్రారంభమైన మొదటి 10 ఓవర్ల వరకు ఈ ఇద్దరు క్రీజులో ఉంటె భారత్ ను తప్పకుండ బలమైన స్థానంలో ఉంచే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ప్రస్తుతం అడిలైడ్ పిచ్ వెలుతురులో బ్యాటర్లకు సహకరిస్తుంది. కాబట్టి ఈ ఇద్దరు రేపు మొదటి రెండు సెషన్స్ బ్యాటింగ్ చేయగలిగితే ప్రస్తుతం 29 పరుగుల వెనుకంజలో ఉన్న టీమిండియా భారీ ఆధిక్యం సాధించే ఛాన్స్ లు ఉన్నాయి.