దేశాన్ని అమ్మేందుకు సిద్ధం అయ్యారు రాహుల్ గాంధీ : ఎంపీ కొండా విశ్వేశ్వర్

-

పదేళ్లు మోసం చెస్తే గత ప్రభుత్వాన్ని ప్రజలు బొంద పెట్టారు. ఆరు గ్యారంటీలు హామీ ఇవ్వడంతో ఆశతో కాంగ్రెస్ ను గెలిపించారు. కానీ అధికారం లోకి వచ్చి ఎడాదైన ఇంకా ప్రభుత్వం పడిపోలేదనే సంబరాలు జరుపుకుంటున్నారు అని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. ఈ ప్రభుత్వం జరిపేది రాజకీయ పండగ. ఏడాదైనా పదవి పోకుండా ఉన్నందుకు రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు. దేశాన్ని అమ్ముకునే వాళ్ళు ఎవరో తేటతెల్లమైంది. ప్రధాని అయ్యేందుకు దేశాన్ని అమ్మేందుకు సిద్ధం అయ్యారు రాహుల్ గాంధీ.

కానీ దేశాన్ని కాపాడేది నరేంద్ర మోడీ. బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే అని ప్రచారం చేసి, అబద్దాలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఆరు గ్యారంటేలతో మోసం చేశారు. రైతన్నలను మోసం చేశారు. మోడీ ప్రభుత్వం వల్లే రైతులు అంతో ఇంతో బతకగలుగుతున్నారు. యువకులకు 5 లక్షలు ఎక్కడ.. మహిళలకు 2500 ఎక్కడ. ఫ్రీ బస్ పెట్టి.. బస్సుల సర్వీస్ లను తగ్గించారు. అన్నింట్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయ్యింది. రాష్ట్రంలో మున్సిపాలిటీలకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు శూన్యం. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు, ప్రజలు కట్టే టాక్స్ లతోనే మునిసిపాలిటీ లు నడుస్తున్నాయి. ఈ ప్రభుత్వం దివాలా తీసింది. కాంగ్రెస్ చరిత్రలో రాష్ట్ర మేనిఫెస్టోను ఓ ఎన్నికల కిరాయి స్ట్రాటజీస్ట్ తయారు చేశారు. ఇక హర్యానా, మహారాష్ట్రలో గెలిచాం.. తెలంగాణలో కూడా బీజేపీ ప్రభుత్వం రాబోతుంది అని ఎంపీ కొండా విశ్వేశ్వర్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news