EESL ఆన్ లైన్ లో రిజిస్ట్రేషన్ లు ఎంతో వేగంగా జరుగుతున్నాయి. ఈ రిజిస్ట్రేషన్ తో ఇంటి వద్ద నుంచే సంపాదించుకుంటున్నారు అని సీఎం చంద్రబాబు అన్నారు. అంగన్వాడీలు ఇప్పుడు ఇచ్చిన స్టవ్ ల ద్వారా వేగంగా వంటలు చేయగలరు. 43 వేల స్కూళ్ళలో పేరెంట్స్ కమిటీ మీటింగ్ పెట్టింది ప్రపంచంలోనే మొదటిసారి. ఇక ఏ రాష్ట్రంలో అయినా తలసరి విద్యుత్ వినియోగం తలసరి ఆదాయాన్ని చెపుతుంది పరిశ్రమలు, వ్యవసాయం, వాహనాలు అన్నిటికీ విద్యుత్ అవసరం.
కాబట్టి 1998లో విద్యుత్ రంగ సంస్కరణలు తీసుకొచ్చాం. 2004కి మనం పవర్ వినియోగంలో పొదుపులో ఉన్నాం. విద్యుత్ రంగంలో ఏపీని మొదటి ర్యాంకు కు తెస్తాం టీడీపీ హయాంలో. గత టీడీపీ ప్రభుత్వం హయాంలో విద్యుత్ వెలుగులు తెచ్చాం. ఇక ఒక యూనిట్ కరెంట్ ఆదా చేస్తే రెండు యూనిట్ల కరెంటు ఉత్పత్తి చేసినట్టవుతుంది. అలాగే ఒక ఉర్జావీర్ కు 2500 నుంచీ 15వేలు అదనపు ఆదాయం వస్తుంది అని చంద్రబాబు అన్నారు.