టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప2 డిసెంబర్ 05న ప్రపంచ వ్యాప్తంగా భారీగా రిలీజ్ అయింది. ఈ మూవీ పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. ఈ సినిమా ప్యాన్ ఇండియా భాషాల్లో రిలీజ్ కాగా అన్ని చోట్ల మినిమం ఆక్యుపెన్సీతో ప్రదర్షింపబడుతోంది. అలాగే అల్లు అర్జున్ కెరీర్ లోనే ఈ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచిందని చెప్పవచ్చు. మొదటి రోజు రూ.294 కోట్లు కలెక్ట్ చేసి ఇండస్ట్రీ
రికార్డులు క్రియేట్ చేసింది.
తాజాగా మేకర్స్ పుష్ప 2 రెండోరోజు కలెక్షన్లు ప్రకటించారు. ఇందులోభాగంగా రెండు రోజులకిగానూ ప్రపంచవ్యాప్తంగా రూ.449 కోట్లు(గ్రాస్) కలెక్ట్ చేసినట్లు సోషల్ మీడియా ద్వారా అధికారికంగా తెలిపారు. కేవలం హిందీలో రెండు రోజుల్లో రూ.131 కోట్లు వసూలు చేసి రికార్డు నెలకొల్పింది. ఈ విషయానికి సంబంధించిన పోస్టర్ ని రిలీజ్ చేస్తూ అల్లు అర్జున్ కెరీర్ లోనే ఇది ఆల్ టైమ్ హిట్ అని తెలిపారు. రెండు రోజుల్లనే అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాలలో పుష్ప 2 టాప్ లో నిలిచింది.