పుష్ప-2 సక్సెస్ మీట్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పలు ఆసక్తికర కామెంట్స్ చేశారు. ముఖ్యంగా సినిమా మొత్తాన్ని హిట్ చేసేది దర్శకుడు మాత్రమే అన్నారు. ఈరోజు నాకు పేరు వచ్చినా.. వేరే ఆర్టీస్టులకు పేరు వచ్చినా ఆ క్రెడిట్ అంతా ఒక్కడికే దక్కుతుందన్నారు. ముందుగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ప్రత్యేకంగా థాంక్యూ.. మీ సపోర్టు చాలా అద్భుతంగా ఉందన్నారు.
ఇంత పెద్ద సినిమా చేసిన తరువాత మీలాంటి వాళ్లు ఇచ్చిన సపోర్టు వల్ల మరింత ముందుకెళ్తున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నారా చంద్రబాబు నాయుడికి ఎప్పటి నుంచో సినీ పరిశ్రమ మీద మీ ప్రేమ కొనసాగుతూనే ఉంది. సభాముఖంగా మిమ్మల్ని అభినందిస్తున్నానని తెలిపారు అల్లు అర్జున్. ఈ స్పెషల్ జీవో పాస్ అయి స్పెషల్ హైక్స్ రావడానికి కారణమైన పవన్ కళ్యాణ్ కి మనస్పూర్తిగా అభినందనలు తెలియజేశారు. పర్సనల్ గా కళ్యాణ్ బాబాయి థాంక్యూ అనగానే సక్సెస్ మీట్ ప్రోగ్రామ్ కి వచ్చిన వారందరూ కేరింతలు కొట్టారు. అల్లు-మెగా ఫ్యాన్స్ గొడవల వేళ బన్నీ ఈ కామెంట్స్ చేయడంతో ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.