Tirumala on Visit Vaikuntha from 10th to 19th January: తిరుమల శ్రీ వారి భక్తులకు బిగ్ అలర్ట్. జనవరి 10 నుంచి 19వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనం ఉండనుంది. ఈ మేరకు టీటీడీ ప్రకటన చేసింది. ఇక అటు తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 13 గంటల సమయం పడుతోంది. తిరుమల..వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 24 కంపార్టుమెంట్లలో వేచివున్నారు భక్తులు. టోకెన్ లేని భక్తులకు తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 13 గంటల సమయం పడుతోంది.
నిన్న శ్రీవారిని 78, 569 మంది భక్తులు దర్శించుకున్నారు. 28, 193 మంది భక్తులు..తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ. 3.54 కోట్లుగా నమోదు ఐంది. ఇక అటు తిరుమలలో 16వ తేదీ నుంచి ధనుర్మాస నెల ప్రారంభం కానుంది. ఈ నెల 16వ తేదీ నుంచి నెల రోజులు పాటు శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ బదులుగా స్వామివారికి తిరుప్పావైతో మేల్కోలుపు ఉంటుంది.