రైతుల తరపున అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదిస్తాం అని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR అన్నారు. గురుకులాల్లో ఉన్న దుర్భర పరిస్థితులపై RS ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో ఓ రిపోర్ట్ ఇచ్చాము. గురుకులాలు ఆనాడు ఎలా ఉన్నాయి నేడు ఎలా ఉన్నాయి అని కళ్లకు కట్టినట్టు చూపాలని కేసీఆర్ అన్నారు. రైతులపై దాడి చేస్తూ భూములు లాక్కుంటూ ఫార్మాసిటీ ఏర్పాటు చేస్తే అడ్డుకుంటాం అని తెలిపారు.
అలాగే మా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల హక్కుల ఉల్లంఘన జరుగుతుంది. అత్యంత మూర్ఖంగా, అనాలోచితంగా చరిత్ర గురించి తెలియకుండా ఏర్పాటు చేస్తున్న విగ్రహం గురించి పోరాడుతాం. మోసాలు, అడ్డగోలు హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కానీ కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి మేనిఫెస్టో పై నిలదిస్తాం. రాష్ట్ర ప్రజల గొంతుకై తెలంగాణ సమస్యల పై అసెంబ్లీలో పోరాడుతాం. రాష్ట్రంలో అరకొరగా రుణమాఫీ చేశారు. కొనుగోలు కేంద్రాలు సరిగా నడపలేని పరిస్థితి ఉంది. ఇక విజయోత్సవాల పేరుతో కాంగ్రెస్ పార్టీ ప్రజల్ని మరోసారి మోసం చేస్తూంది అని KTR పేర్కొన్నారు.