పవన్ కళ్యాణ్ కు షాక్… కాకినాడ ఎస్పీ సెలవు పెట్టడంపై హోం మంత్రి అనిత క్లారిటీ ఇచ్చారు. విజయవాడ సబ్ జైలులో హోమ్ మంత్రి అనిత ఆకస్మిక తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. కాకినాడ పవన్ కళ్యాణ్ వెళ్ళిన సమయంలో కాకినాడ ఎస్పి వారం రోజుల నుండి సెలవులో ఉన్నట్లు నాకు నివేదిక వచ్చిందని వివరించారు. ఉన్నట్టుండి కాకినాడ ఎస్పీ సెలవు పెట్టలేదని వివరణ ఇచ్చారు. సబ్ జిల్లాలో పరిస్తులు ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి రావడం జరిగిందని… మౌలిక వసతులపై ఆరా తీయడం జరిగిందని తెలిపారు.
జైలులో అధికారులపై వస్తున్న ఆరోపణలపై తనిఖీ చేయడం జరిగిందని… జైలుకు అధికారులపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరుగుతోందన్నారు. రెండు రోజుల్లో నివేదిక వస్తుంది త్వరలో చర్యలు తీసుకుంటామని… తప్పులు బయటపడుతున్నాయి విజయసాయి రెడ్డి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ఆగ్రహించారు. కాకినాడ పోర్టు కేసులో విచారణ జరుగుతోంది…. వైసిపి నేతలు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని మండిపడ్డారు. జగన్&కో రాష్ర్ట సంపదను దోచుకుందని ఆరోపణలు చేశారు.