ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన మూవీ పుష్ప-2 కలెక్షన్లలో ఊచకోత కోస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటివరకు వచ్చిన సినిమాలకి సంబంధించిన రికార్డులన్నింటిని బ్రేక్ చేసింది. ముఖ్యంగా ఈ సినిమా విడుదలైన నాలుగు రోజుల్లోనే రూ.829 కోట్ల కలెక్సన్లు రాబట్టింది. తాజాగా మైత్రీ మూవీ మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేస్తూ.. నాలుగు రోజుల గ్రాస్ కలెక్సన్స్ అనౌన్స్ చేశారు.
ముఖ్యంగా తెలుగు కంటే హిందీలోనే పుష్ప-2కి ఎక్కువ కలెక్షన్లు వస్తున్నాయని తెలిపారు. హిందీ సినిమాల హిస్టరీలో రూ.291 కోట్లు నికర వసూల్లు సాధించింది. బాలీవుడ్ సినిమాల కలెక్షన్ల ఆల్ టైమ్ రికార్డును పుష్ప-2 తిరగరాసింది. అంతేకాదు.. నాలుగో రోజు ఆదివారం హిందీ వెర్షన్ రూ.86 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. కానీ తెలుగులో మాత్రం రూ.44 కోట్ల వరకే గ్రాస్ కలెక్షన్లు దక్కించుకున్నట్టు సమాచారం. వైల్డ్ ఫైర్ బ్లాక్ బస్టర్.. సినిమాల్లో రూలింగ్ అంటూ మేకర్స్ క్యాప్షన్స్ ఇచ్చారు. అల్లు అర్జున్ కి క్రేజీ ఉన్న కేరళలో వసూళ్లు సాధించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.