తనపై జరిగిన దాడి ఘటనపై పహడి షరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేసారు మంచు మనోజ్. అయితే మంచు మనోజ్ తన కుటుంబ సభ్యులపై ఫిర్యాదు చేయలేదు అని పహాడి షరీఫ్ సీఐ గురువ రెడ్డి తెలిపారు. ఇంట్లో ఉండగా పదిమంది గుర్తు తెలియని వ్యక్తులు ఇంటికి వచ్చి అరిచారనీ తమపై దాడి చేశారు అని ఫిర్యాదు చేశారు. వారిని పట్టుకునే ప్రయత్నం చేసాను.. వారు పారిపోయారు నాకు గాయాలు అయ్యాయి. అయితే నాకు నా కుటుంబం సభ్యులకు థ్రెట్ ఉంది అని మనోజ్ చెప్పినట్లు సీఐ తెలిపారు.
ఇక తనపై దాడి చేసిన వారి వివరాలు కూడా మనోజ్ చెప్పలేదు. మనోజ్ కి ఒక్కరికే గాయాలు అయ్యాయి. గటన స్థలంలో కిరణ్ రెడ్డి విజయ రెడ్డి అనే వ్యక్తి సీసీ ఫుటేజ్ కూడా మాయం చేశారు అని చెప్పాడు. ఈ కేసులో పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తాము. దడి సమయంలో 100కు కాల్ రాగానే మేము రెస్పాండ్ అయ్యాము.. ఘటన స్థలానికి చేరుకున్నాం అని పహాడి షరీఫ్ సీఐ పేర్కొన్నారు.