ఆశా వర్కర్లపై దాడి చేసిన పోలీసులను డిస్మిస్‌ చేయాల్సిందే – KTR

-

ఆశా వర్కర్లపై దాడి చేసిన పోలీసులను డిస్మిస్‌ చేయాల్సిందే అంటూ డిమాండ్‌ చేశారు బీఆర్ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ KTR. నిన్న ఎవరైతే దాడి చేసిన పోలీసులు ఉన్నారో వారిని ఉద్యోగం నుంచి పూర్తిగా తొలగించాలి అని డిమాండ్ చేస్తున్నామన్నారు. నిన్న ఆశ వర్కర్ల ఆందోళనలో గాయపడ్డ ఆశా వర్కర్లను పరామర్శించేందుకు కేటీఆర్ ఉస్మానియా ఆసుపత్రికి చేరుకున్నారు. అనంతరం కేటీఆర్‌ మాట్లాడారు.

ఖాకీ యూనిఫాం ఉంది కదా అని ఇష్టమొచ్చినట్టు వ్యవహరిస్తే.. వదిలిపెట్టబోమని కేటీఆర్ వార్నింగ్ ఇచ్చారు. ఆశా వర్కర్లకు అండగా ఉంటాం.. వారితో భుజం భుజం కలిపి నడుస్తామన్నారు. అసెంబ్లీలో కొట్లాడుతాం.. బయట కూడా కొట్లాడుతామని తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకునే దాకా.. మేము పోరాడుతామని కేటీఆర్ భరోసా కల్పించారు. ఆశా వర్కర్లేమీ గొంతెమ్మ కోరికలు కోరలేదు కదా? అన్నారు కేటీఆర్. జీతం పెంచుతామని, ఉద్యోగ భద్రత, ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తామని చెప్పిందే మీరు… మీరిచ్చిన హామీని నిలబెట్టుకోమని చెప్పి వస్తే.. మీరు చేసిన దుశ్శాసన పర్వం ఆడబిడ్డలు మర్చిపోరన్నారు.

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news