ఇన్నాళ్లు ఉన్న సస్పెన్స్ కు తెరపడింది.. జనసేనలో కీలక నేతగా ఉన్న నాగబాబుకు మంత్రిపదవి దక్కబోతోంది.. మెగా బ్రదర్ నాగబాబుకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.. ఆయన్ని క్యాబినెట్ లోకి తీసుకుంటున్నట్లు సీఎం చంద్రబాబునాయుడు ప్రకటన ద్వారా స్పష్టం చేశారు.. ఇంతకీ ఆయనకు ఏ శాఖ ఇవ్వబోతున్నారు..? క్యాబినెట్ లో ఆయన ఎంట్రీ ఎప్పుడు ఉంటుందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది..
పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీలో నాగబాబుకు ది కీలక పాత్ర.. పార్టీ సిద్దాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు.. పార్టీ వ్యవహారాలన్నీ ఆయనే చక్కదిద్దుతున్నారు.. ఈ క్రమంలో ఆయన్ని జనసేన నుంచి రాజ్యసభకు పంపబోతున్నట్లు గత కొద్దిరోజులుగా ప్రచారం జరిగింది.. కానీ ఆయనకు ఛాన్స్ దక్కలేదు.. ఏపీలో మూడు రాజ్యసభ స్థానాలకు టీడీపీ నుంచి బీదా మస్తాన్ రావు, సతీష్, బిజేపీ నుంచి ఆర్ కృష్ణయ్య పేర్లు ఖరారు అయ్యాయి.. ఇదే సమయంలో నాగబాబుకు సీఎం చంద్రబాబుకు గుడ్ న్యూస్ చెప్పారు.. ఆయన్ని మంత్రివర్గంలోకి తీసుకుంటున్నట్లు ప్రకటించారు..
సార్వత్రిక ఎన్నికల నుంచి త్యాగాలు చేస్తున్న నాగబాబుకు.. మంత్రి పదవి ద్వారా మంచి అవకాశం దక్కిందని విశ్వేషకులు చెబుతున్నారు.. అనకాపల్లి ఎంపీ సీటు నుంచి నాగబాబును బరిలోకి దింపాలని పవన్ కళ్యాణ్ భావించారు. కానీ పొత్తుల్లో భాగంగా ఆ సీటు బిజేపీకి వెళ్లింది.. దాని తర్వాత కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత నాగబాబుకు నామినెటెడ్ పదవి వస్తుందని పార్టీ నేతలు చెబుతూ వచ్చారు.. కానీ అక్కడ కూడా నాగబాబుకు న్యాయం జరగలేదు.. రాజ్యసభకు పంపే ఆలోచనలో పవన్ ఉన్నారని పార్టీ నేతలు చెప్పారు.. కానీ చివరికి మంత్రివర్గంలోకి వెళ్తున్నారు.
నాగబాబును ఎమ్మెల్సీ చేసి.. తర్వాత మంత్రిగా క్యాబినెట్ లోకి తీసుకోనున్నారు.. మరో ఆరునెలల్లో ఎమ్మెల్సీ స్తానాలు ఖాళీ కాబోతున్నాయి.. ఈ క్రమంలో ఆయన్ని మంత్రిగా చెయ్యాలనే ఆలోచనలో కూటమి సర్కార్ ఉందట.. జనసేన తరపున కందుల దుర్గేష్, నాదెండ్ల మనోహర్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లు క్యాబినెట్ లో ఉన్నారు.. నాగబాబుకు చేరికతో జనసేన సంఖ్యాబలం నాలుగుకు చేరబోతోంది.. నాగబాబుకు టూరిజం లేదంటే సినిమాటోగ్రఫి పదవి దక్కే ఛాన్స్ ఉందని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగతోంది.. మొత్తంగా నాగబాబుకు త్యాగాలకు ప్రతిఫలం దక్కిందని జనసేన నేతలు చర్చించుకుంటున్నారు.