తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నిన్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన విషయం తెలిసిందే. తాజాగా తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఉద్యమ సమయంలో తెలంగాణ తల్లిని చంపుతా అని తుపాకీ పట్టుకొని తిరిగిన వాడు ఇవాళ రాష్ట్రానికి కొత్త తల్లిని తీసుకొచ్చాడని విమర్శించారు. కిరాయి రాతగాళ్లు రాసిచ్చిన స్క్రిప్ట్ నిన్న సీఎం చదివారని సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సంస్కృతిపై జరుగుతున్న భయంకర దాడి అన్నారు. దారి తప్పి ఆ దొంగల వెంట నడుస్తున్న తెలంగాణ వాదులు పునరాలోచించుకోవాలని సూచించారు.
కాంగ్రెస్ నేతలంతా తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే రకమని సెన్షేషనల్ కామెంట్స్ చేశారు జగదీశ్ రెడ్డి. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ పేరిట అడ్డమైన పాటలు పాడారని మండిపడ్డారు. తెలంగాన తల్లి విగ్రహాష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఏ ఒక్కరికీ తెలంగాణ భావోద్వేగం లేదన్నారు. కేసీఆర్ హయాంలో బతుకమ్మను అధికారికంగా జరిపాం. బతుకమ్మ పండుగకు చీరలను ఇచ్చామని గుర్తు చేశారు.