కేసీఆర్ కు శిశుపాలుడి గతి పట్టింది : ఎంపీ అరవింద్

-

తెలంగాణ కు 7 నవోదయ విద్యాలయాలు మంజూరు చేస్తే అందులో 2 నిజామాబాద్ పార్లమెంటు కు కేటాయించినందుకు మోడీకి ధన్యవాదాలు తెలిపారు బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్. జగిత్యాలకు తొందర్లోనే కేంద్రీయ విద్యాలయం కూడా మంజూరు అవుతుంది. వరంగల్ ఆదిలాబాద్ లో బ్రౌన్ ఫీల్డ్, జక్రాన్ పల్లి లో బ్రౌన్ ఫీల్డ్ విమానాశ్రయాలు మంజూరు అయ్యాయి. తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ వల్లనే జక్రాన్ పల్లి విమానాశ్రయం ఆలస్యం అవుతుంది. నిజామాబాద్ పార్లమెంటులో ఎక్కువ NRI లు ఉన్నారు. గత ప్రభుత్వం వాళ్లు తిరిగి వచ్చేలా చేస్తామని చెప్పింది చేయలేదు.. ఇప్పటి ప్రభుత్వం కూడా ఏమీ చేయట్లేదు.

ROB లకి పేమెంట్ లు విడుదల చేయాలని కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి నీ కోరుతున్న. అయితే శిశుపాలుడు గతి కేసీఆర్ కి పట్టింది. అలాగే సంవత్సరం నుండి ప్రజల్ని కాంగ్రెస్ మోసం చేస్తూనే ఉంది. 25 శాతం మందికి రుణమాఫీ అయింది.. ఇంకా 75 శాతం కావాలి. పసుపు బోర్డు యొక్క హెడ్ క్వార్టర్ ను మహారాష్ట్రకు తరలిస్తారని ప్రచారం జరుగుతుంది. అది కరెక్ట్ కాదు. తెలంగాణ కే హెడ్ క్వార్టర్ వస్తుంది.. ఇందూరు కే వస్తుంది. తెలంగాణ అభివృద్ధి కేసీఆర్ చేయలేదు అని ఎంపీ అరవింద్ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news