మోహన్ బాబు ఇంటి గేట్లు బద్దలు కొట్టుకొని లోపలికి వెళ్లిన మంచు మనోజ్..!

-

గత రెండు రోజులుగా హాట్ టాపిక్ గా ఉన్న మంచి ఫ్యామిలీ వివాదం ఇప్పుడు మరో స్థాయికి చేరుకుంది అనే చెప్పాలి. డీజీపీని కలిసిన తర్వాత జల్‌పల్లిలో ఉన్న ఇంటికి వద్దకు వచ్చిన మంచు మనోజ్ ను ఇంటి లోపలి రానివ్వలేదు. దానితో మోహన్ బాబు నివాసం గేట్లు బద్దలు కొట్టుకొని లోపలికి వెళ్లారు మంచు మనోజ్ అలాగే ఆయనతో వచ్చిన బౌన్సర్స్.

అయితే నా కూతురు లోపల ఉంది అంటూ డోర్ ను గేట్లు బద్దలు కొట్టి లోనికి వెళ్లారు మనోజ్. నా కూతురు ఉందంటూ ఆవేదన వ్యక్తం చేసారు మంచు మనోజ్. అయితే మనోజ్ ఎంత మొత్తుకున్నా మోహన్ బాబు ఇంటి గేట్లు అక్కడ ఉన్న సెక్యూరిటీ తరవలేదు. దీంతో గేట్లు బద్దలు కొట్టుకొని లోనికి వెళ్లారు మంచు మనోజ్. ఇక ఈ ఘటనతో మంచి ఫ్యామిలీ ఫైట్ మరింత ముదిరింది అనే చెప్పాలి.

Read more RELATED
Recommended to you

Latest news