కూటమి ప్రభుత్వం రైతులను అన్ని రకాలుగా ముంచేసింది : దేవినేని అవినాష్‌

-

ఎన్టీఆర్ జిల్లా వైసీపీ కార్యాలయంలో అన్నదాతకు అండగా వైసీపీ పోస్టర్ ఆవిష్కరణ చేసారు. ఈ పోస్టర్ ఆవిష్కరణలో ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ , జగ్గయ్యపేట వైసీపీ ఇంఛార్జి తన్నీరు నాగేశ్వరరావు , మేయర్ రాయన భాగ్యలక్ష్మి , డిప్యూటీ మేయర్ బెల్లందుర్గ , వైపీపీ నేతలు పాల్గొన్నారు. ఈ క్రమంలో దేవినేని అవినాష్‌ మాట్లాడుతూ.. ఈనెల 13వ తేదీన రైతుల సమస్యల పై కలెక్టర్ కు వినతిపత్రం అందిస్తాం. మ్యూజియం రోడ్డు నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీగా వెళ్తాం. కూటమి ప్రభుత్వం రైతులను అన్ని రకాలుగా ముంచేసింది.

వైఎస్ జగన్ రైతుల కోసం రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశారు. జగన్ రైతులకు పెట్టుబడి సాయం అందించారు. కూటమి అధికారంలోకి వచ్చాక ఆర్బీకే సెంటర్లు లేకుండా పోయాయి. రైతుల కోసం బడ్జెట్ లో ప్రస్తావించకుండా మోసం చేసింది కూటమి ప్రభుత్వం. సూపర్ సిక్స్ లో చెప్పిన విధముగా రైతుకు పెట్టుబడి సాయం గురించి కూటమి నేతలు మాట్లాడటం లేదు. కనీస మద్దతు ధర కూడా రైతుకు దక్కకుండా చేస్తున్నారు . రైతాంగానికి వైసీపీ అండగా ఉంటుంది అని దేవినేని అవినాష్‌ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news