కాంగ్రెస్ పార్టీకి విజయోత్సవాలు జరుపుకునే అర్హత లేదు అని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు అన్నారు. ప్రతి మహిళకు 30 వేల రూపాయలు కాంగ్రెస్ సర్కార్ బాకి పడ్డది. ప్రతి పెన్షన్ దారునికి 24 వేల రూపాయలు, ప్రతి కౌలు రైతు కు 15 వేలు, వ్యవసాయ కూలీ 12 వేలు, ప్రతి నిరుద్యోగికి 48 వేలు బాకీ పడ్డది. అమర వీరుల కుటుంబానికి 3 లక్షలు, ప్రతి ఆటో డ్రైవర్ కి 12 వేలు ఈ ప్రభుత్వం బాకీ. తులం బంగారం , స్కూటీ బాకీ పడ్డది. ఇక అన్ని వర్గాలను రేవంత్ రెడ్డి సర్కార్ దగా చేసింది.
బెల్ట్ షాప్ లను మూసి వేస్తామని చెప్పిన సర్కార్.. వాటి ద్వారా ఎక్కువ అమ్మిస్తున్నారు. కోట్లాది రూపాయలు తో విజయోత్సవాలు చేశారు.. ప్రజా ధనాన్ని ఈ ప్రభుత్వం దుర్వినియోగం చేసింది. రిటైర్ అయిన ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వడం లేదు… చిన్న చిన్న ఉద్యోగులకు ఇబ్బందులు పెడుతున్నారు.. బడా కాంట్రాక్టర్ లకి మాత్రం నెలకి వేయి 15 వందల కోట్లు ఇస్తుంది. కమిషన్ లకు కక్కుర్తి పడి వాళ్ళకి నిధులు మంజూరు చేస్తుంది. విజయోత్సవాల ఖర్చు పై శ్వేత పత్రం విడుదల చేయాలి అని కాసం వెంకటేశ్వర్లు అన్నారు.