రాష్ట్రంలో ఫిర్యాదుల స్వీకరణపై కలెక్టర్ల సదస్సులో సమీక్ష నిర్వహించారు. గ్రీవెన్స్ పరిష్కారంపై ప్రజెంటేషన్ ఇచ్చారు సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి సురేశ్ కుమార్. రాష్ట్రంలో సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలకు ఇచ్చిన ఫిర్యాదుల అన్నిటినీ ఒక్కచోట నమోదు చేస్తున్నాం. గడచిన ఆరు నెలలుగా ప్రజల నుంచి 1,29,963 ఫిర్యాదులు ప్రజల నుంచి వచ్చాయి. 78,700 ఫిర్యాదులు అన్నీ రెవెన్యూ విభాగం నుంచే వచ్చాయి. 14,119 ఫిర్యాదులు పోలీసు విభాగానికి చెందినవి వచ్చాయి. 13,146 మున్సిపల్ శాఖలో ఫిర్యాదులు వచ్చాయి. అన్ని విభాగాలు 70 శాతం మేర ఫిర్యాదులు పరిష్కరించినట్టు చూపుతున్నాయి.
అయితే ప్రజల నుంచి సంతృప్తి స్థాయి ప్రతీ నెలా తగ్గుతూ వస్తోంది. ప్రజలకు సరైన పరిష్కారం చూపించటం లేదని అర్ధం అవుతోంది. వారిలో అసంతృప్తి ఎక్కువ అయితే ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తుంది. కొన్ని ఫిర్యాదులు పరిష్కరించలేనివి కూడా వస్తున్నాయి. ప్రజలకు సమాధానం చెప్పేటప్పుడు నిర్లక్ష్య ధోరణి ఉండకూడదు. చాలా సమస్యల్ని మానవత్వంతో పరిష్కరించాలని అందరికీ సూచిస్తున్నాను. ఫిర్యాదుల పరిష్కారంలో నాణ్యత ఉండాలి అదే ప్రామాణికంగా పనిచేయాలి. ఆర్ధిక, ఆర్థికేతర అంశాలుగా వాటిని వేరు చేసి వీలైనంతమేర పరిష్కరించాలి. అటవీ భూములకు సంబంధించిన విషయాలపై ప్రభుత్వ విభాగాలు కూర్చుని చర్చించి పరిష్కారం చూపించాలని కోరుతున్నాను అని సీఎం అన్నారు.