ప్రభుత్వ తీరుపై పోరాటాలకు సిద్ధం కావాలని జగన్ పిలుపునిచ్చారు. అంతా కూడా పోరుబాటు పట్టాల్సిందే. ప్రజలకు మనం దగ్గర కావాలి. అలా దగ్గరగా ఉంటే మనకు సానుకూలంగా పరిస్థితి వస్తుంది. అలా దగ్గరగా ఉన్నవాళ్లే ఎమ్మెల్యేలు కాగలుగుతారు. ఈనెల 13న రైతు సమస్యలపైన కార్యక్రమం పెట్టాం. గతంలో మనం రూ.13500 ఇచ్చాం. ఇందులో ఆరువేలు కేంద్రమే ఇస్తుందని టీడీపీ వాళ్లు అన్నారు. అంటే కేంద్రం ఇస్తున్నది కాకుండా ఏడాదికి మరో రూ.20వేలు ప్రతిరైతుకూ ఇస్తామన్నట్టుగా భావన కల్పించారు. కానీ ఇప్పుడు ఏమీ ఇవ్వడం లేదు. ధాన్యం కనీస మద్దతు ధరకోసం కూడా చేస్తున్నాం. ఉచిత పంటల బీమాను కూడా ఎత్తివేశాడు.
కరెంటు ఛార్జీల విషయంలో కూడా ఇలాగే చంద్రబాబు అన్నాడు. నేనున్నా.. నేను తగ్గిస్తా.. అన్నాడు. కాని, అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే రూ. 15000 కోట్లు పెంచాడు. దీనిపైన ఈనెల 27న కార్యక్రమం పెట్టాం. అలాగే పీజు రియింబర్స్ మెంట్కోసం జనవరి 3న కార్యక్రమం చేస్తున్నాం. ఇప్పటికి నాలుగు త్రైమాసికాల నుంచి విద్యాదీవెన అందలేదు. అలాగే వసతి దీవెన డబ్బులు కూడా ఇవ్వ లేదు. విద్యాదీవెన, వసతి దీవెన అందక ప్రజలుచదువులు మానేసి పొలం పనులు చేసుకుంటున్నారు. ఫీజులు కట్టకపోతే కాలేజీ యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వని పరిస్థితులు ఉన్నాయి అని జగన్ తెలిపారు.