గజగజ.. తెలంగాణ, ఏపీలో భారీగా పెరిగిన చలి..!

-

తెలంగాణ, ఏపీ రాష్ట్రాల ప్రజలకు బిగ్‌ అలర్ట్. తెలంగాణ, ఏపీలో భారీగా చలి పెరిగింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి మెదక్ జిల్లాలో చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో సింగిల్ డిజిట్ కి పడిపోయాయి ఉష్ణోగ్రతలు. చలి తీవ్రతతో చలి మంటలు పెట్టుకుంటున్నారు జనాలు. మెదక్ జిల్లా శివంపేటలో 9.4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు అయ్యాయి.

Big alert for the people of Telangana and AP states. Heavy cold has increased in Telangana and AP

సంగారెడ్డి జిల్లా నల్లవల్లిలో 9.7, కంగ్టి 9.8, కోహిర్ 9.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావడం జరిగింది. సిద్దిపేట జిల్లా అంగడి కిష్టాపూర్ లో 10.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యాయి. హైదరాబాద్‌ లో చలి విపరీతంగా పెరిగింది. ఉదయం 7 గంటల వరకు ఎవరూ నిద్ర లేచే పరిస్థితి కనిపించడం లేదు. ఏపీలోని కోస్తాంధ్ర ప్రాంతాల్లో చలి పెరిగింది. దీంతో ఉదయం పచ్చటి పొలాలు, మంచుతో చాలా ప్రాంతాలు దర్శనం ఇస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news