అల్లు అర్జున్ అరెస్ట్ పై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి..!

-

సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ అరెస్టైన విషయం తెలిసిందే. అయితే అల్లు అర్జున్ ని చిక్కడపల్లి పోలీసులు రెండు గంటల పాటు విచారించిన అనంతరం గాంధీ ఆసుపత్రికి తీసుకొచ్చి ఆసుపత్రి సూపరింటెండెంట్ సమక్షంలో  వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ తరువాత గాంధీ ఆసుపత్రి నుంచి నాంపల్లి క్రిమినల్  కోర్టుకు తరలించారు.

cm Revanth
cm Revanth

ఈ నేపథ్యంలో పలువురు అల్లు అర్జున్ అరెస్ట్ పై స్పందించారు. తాజాగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఇవాళ ఢిల్లీలోని పార్లమెంట్ లో కేంద్ర మంత్రులను కలిశారు సీఎం రేవంత్ రెడ్డి. అనంతరం మీడియాతో చిట్ చాట్ లో మాట్లాడారు. ఓ మీడియా ప్రతినిధి అల్లు అర్జున్ అరెస్ట్ గురించి ప్రశ్నించగా.. చట్టం తన పని తాను చేసుకు పోతుందని.. చట్టం ముందు అంతా సమానమేనని తెలిపారు. ఇందులో నా జోక్యం ఏమి ఉండదు. తొక్కిసలాటలో ఓ మహిళా చనిపోయింది కాబట్టి పోలీసు చర్యల్లో భాగంగా అల్లు అర్జున్ ను అరెస్ట్ చేశారని తెలిపారు. చట్టపరమైన ప్రక్రియ జరుగుతుందని వెల్లడించారు సీఎం రేవంత్ రెడ్డి. 

Read more RELATED
Recommended to you

Latest news