ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్ ని ఇవాళ చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అల్లు అర్జున్ ను తన నివాసంలో అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కి తరలించారు. అనంతరం ఆయనకు గాంధీ ఆసుపత్రిలో సూపరింటెండెంట్ విభాగంలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ తరువాత నాంపల్లి క్రిమినల్ కోర్టులో హాజరు పరిచారు పోలీసులు. మేజిస్ట్రేట్ విచారణ చేపట్టిన తరువాత 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. దీంతో అల్లు అర్జున్ ను చంచల్ గూడ జైలుకు తరలించారు.
అల్లు అర్జున్ అరెస్ట్ పై పలువురు సినీ ప్రముఖులు స్పందించారు. తాజాగా సీనియర్ హీరో, హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఎక్స్ వేదికగా అల్లు అర్జున్ అరెస్ట్ ను ఖండించారు. “అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయడం అన్యాయం అని.. ఇలా చేయడం కరెక్ట్ కాదన్నారు. మేము ఎల్లప్పుడూ అల్లు అర్జున్ కు అండగా ఉంటాం” అని స్పష్టం చేశారు.