అల్లు అర్జున్ అరెస్ట్ పై హీరో నాని సీరియస్ అయ్యారు. సినిమా వాళ్లపై చూపించే ఉత్సాహం.. సాధారణ ప్రజల కష్టాలను తీర్చడం మీద పెడితే సమాజం ఎప్పుడో బాగుపడేదని అంటూ అల్లు అర్జున్ అరెస్ట్ పై హీరో నాని స్పందించారు. అల్లు అర్జున్‌ని అరెస్టు చేయడం నిజంగా దురదృష్టకరం అన్నారు హీరో నాని. తొక్కిసలాట ఘటనలు మరోసారి జరగకుండా జాగ్రత్తగా ఉండేందుకు.. సంధ్య థియేటర్ ఘటన ఒక గుణపాఠం అని తెలిపారు. ఏది ఏమైనా.. ఆ ఘటనకు కేవలం ఒక్క వ్యక్తి మాత్రమే బాధ్యుడు కాదు అంటూ రేవంత్ రెడ్డి సర్కార్ చురకలు అంటించారు హీరో నాని.
అటు అల్లు అర్జున్ కు బిగ్ షాక్ తగిలింది. 14 రోజుల రిమాండ్ విధించింది తెలంగాణ హై కోర్టు. దీంతో చంచల్ గూడ జైలుకు అల్లు అర్జున్ ను తరలించనున్నారు తెలంగాణ పోలీసులు. అల్లు అర్జున్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై హైకోర్టులో వాదనలు కొనసాగాయి. అల్లు అర్జున్ పై నమోదైన పిటిషన్ కొట్టివేయకపోతే బెయిల్ ఇవ్వాలని హైకోర్టులో అల్లు అర్జున్ లాయర్ వాదనలు వినిపించారు. కానీ చివరకు అల్లు అర్జున్ కు బిగ్ షాక్ తగిలింది. 14 రోజుల రిమాండ్ విధించింది తెలంగాణ హై కోర్టు.