అల్లు అర్జున్ అరెస్టుపై తీన్మార్ మల్లన్న వివాదాస్పద వ్యాఖ్యలు..జానీపై కుట్రలు !

-

teenmaar mallanna comments on allu arjun: అల్లు అర్జున్ అరెస్టుపై తీన్మార్ మల్లన్న వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తెలుగు చిత్ర పరిశ్రమలో… అల్లు అర్జున్ కుట్రలు చేశారని బాంబు పేల్చారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. టాలీవుడ్ ఇండస్ట్రీలో జాతీయ అవార్డు తన ఒక్కనికే రావాలని… ఐ కాన్ స్టార్ అల్లు అర్జున్ కుట్రలు చేసినట్లు… సంచలన ఆరోపణలు చేశారు.

teenmaar mallanna comments on allu arjun

జానీ మాస్టర్ జైలుకు వెళ్లడంలో… అల్లు అర్జున్ కుట్రలు ఉన్నట్లు పరోక్షంగా వ్యాఖ్యానించారు. జానీ మాస్టర్ కు… జాతీయ అవార్డు రాకుండా లేఖ రాసింది వీళ్లే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు తీన్మార్ మల్లన్న.

కాగా,  చంచల్‌గూడ జైలు నుంచి విడుదలైన అల్లు అర్జున్ ఫోటో వైరల్ గా మారింది. ఇవాళ ఉదయం 6 గంటల సమయంలోనే.. చంచల్‌గూడ జైలు వెనుక నుంచి రిలీజ్ అయ్యాడు అల్లు అర్జున్. అయితే.. దీనికి సంబంధించిన ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news