డైలీ చేసే పనిలో ప్రొడక్టివిటీ పెరగాలా..? ఈ మార్పులు చేయండి

-

డైలీ చేసే పనుల్లో ప్రోడక్టివిటీ పెరగాలంటే డైలీ చేసే పనులను అనలైజ్ చేయాలి. మీరు రోజు ఖచ్చితంగా చేయాల్సిన పనులు ఏమిటి? చేస్తున్నది ఏంటి? ఎంతసేపు చేస్తున్నారు వంటి ప్రశ్నలకు మీకు సమాధానాలు రావాలి. రోజువారి పనులు చేసే విధానంలో కాస్త మార్పులు తీసుకువస్తే ప్రోడక్టివిటీ పెరిగి తొందరగా విజయాన్ని అందుకుంటారు.

రెండు మూడు పనులు ఒకేసారి వద్దు:

మల్టీ టాస్కింగ్ చేయడం వెంటనే ఆపేయండి. దానివల్ల మీకు వచ్చే లాభం కన్నా నష్టమే ఎక్కువ. ఒకేసారి రెండు మూడు పనులు చేయడం వల్ల వాటి మీద కరెక్ట్ గా ఫోకస్ చేయలేక పోతారు. దాంతో పని ఆలస్యంగా పూర్తవుతుంది. ప్రోడక్టివిటీ పెరగాలంటే ఒక టైం లో ఒకే పని చేయాలి.

డిజిటల్ డిలీట్:

నెలల తరబడి వాడని యాప్స్ వెంటనే డిలీట్ చేయండి. మీ ఫోన్ ఎంత క్లీన్ గా ఉంటే మీ మనసు, మెదడు అంత క్లీన్ గా ఉంటుంది. కాబట్టి వాడని యాప్స్ ని అవసరం లేని యాప్స్ ని డిలీట్ చేయండి.

ఈవినింగ్ హాబిట్:

సాయంత్రానికి పని పూర్తవుతుంది కాబట్టి ఆ సమయంలో ఏదో ఒక అలవాటును అలవర్చుకోండి. పని పూర్తయ్యాక.. సరదాగా అలా వాకింగ్ చేసి రావడమో, లేకపోతే బయటకు వెళ్లి టీ తాగి రావడమో చేయండి. దానివల్ల ఎక్కువ పనిచేశామన్న ఫీలింగ్ మీకు ఉండదు.

పేమెంట్స్ క్లియర్ చేయండి:

ఒక నెలలో రకరకాల పేమెంట్స్ పే చేయాల్సి ఉంటుంది. కొన్నిసార్లు క్రెడిట్ కార్డుల పేమెంట్లు మర్చిపోతుంటారు. ఇలా అవకుండా ఉండాలంటే ఆటో పేమెంట్ ఆప్షన్ ఎన్నుకోండి. తద్వారా పెనాల్టీ రిస్కు తగ్గుతుంది. మీక్కూడా మెదడు మీద అనవసర శ్రమ ఉండదు.

చిన్న చిన్న విరామాలు:

మార్నింగ్ డెస్క్ ముందు కూర్చుని ఈవినింగ్ వరకు కదలకుండా వర్క్ చేసే అలవాటు మీకు ఉంటే వెంటనే మానుకోండి. మధ్య మధ్యలో చిన్న చిన్న బ్రేక్స్ తీసుకోండి. కంటిన్యూగా
పనిచేయడం వల్ల మీ మెదడు అలసిపోతుంది.

Read more RELATED
Recommended to you

Latest news