తెలంగాణ రాష్ట్రంలోని అన్ని సంక్షేమ, గురుకుల హాస్టల్స్ విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ముఖ్యంగా సంక్షేమ హాస్టల్స్ పై సీరియస్ గా ఫోకస్ పెట్టిన తెలంగాణ ప్రభుత్వం తనిఖీల పేరుతో ఇవాళ హాస్టల్స్ బాట పట్టింది. ఈ బాట పట్టడానికే కూడా ఓ కారణం ఉందనే చెప్పాలి. ఇటీవల ఎక్కువగా ఫుడ్ పాయిజనింగ్ అవుతున్న ఘటనలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. దీంతో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రులు, డిప్యూటీ సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు హాస్టల్స్ ను ఇవాళ హాస్టల్స్ ను సందర్శించి అక్కడే భోజనం చేశారు.
హాస్టల్ విద్యార్థులకు పోషకాహారంతో పాటు రుచికరమైన భోజనం అందించడం ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇప్పటివరకు అమలు అవుతున్న డైట్ లో పలు మార్పులు చేస్తూ విద్యార్థులకు పౌష్టికాహారం అందేలా మెను సిద్ధం చేసింది. ప్రభుత్వ హాస్టళ్లలో ఇప్పటివరకు ప్రతీ ఆదివారం చికెన్ పెడుతున్నారు. తొలిసారిగా విద్యార్థులకు మటన్ పెట్టబోతున్నారు. ఇకపై లంచ్ లో నెలలో రెండుసార్లు మటన్, 4 సార్లు చికెన్ పెట్టనున్నారు. నాన్ వెజ్ భోజనం పెట్టినప్పుడు సాంబార్, పెరుగు కూడా ఉంటుంది. నాన్ వెజ్ తినని వారికి ఆ రోజుల్లో మిల్ మేకర్ కర్రీ పెడతారు. నాన్ వెజ్ లేని రోజుల్లో లంచ్ లో ఉడికించిన గుడ్డు లేదా ఫ్రైడ్ ఎగ్ ఇస్తారు.