మన కోసం ఎవరు నిలబడ్డారో వారికి అసలు మరవకూడదని.. కొందరూ తల్లిదండ్రులను కూడా మరిచిపోతున్నారని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. పొట్టి శ్రీరాములు ఆత్మార్పణం దినం కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తెలుగు వారికి ఓ గుర్తింపు ఇచ్చిన వ్యక్తి పొట్టి శ్రీరాములు అని పవన్ వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజన జరిగిన తరువాత పొట్టి శ్రీరాములు గొప్పతనం మరింతగా తెలిసిందన్నారు.
ఒక జాతికి, కులానికి పొట్టి శ్రీరాములు నాయకుడు కాదు.. ఆంధ్రజాతికి పొట్టి శ్రీరాములు నాయకుడు అని ఆయన స్పష్టం చేశారు. మనం ఆంధ్రులుగా ఉన్నామంటే పొట్టి శ్రీరాములు బలిదానం కారణం అన్నారు. 2047 విజన్ అనేది రాష్ట్ర భవిష్యత్ అని.. 2020 విజన్ ఫలితాలు ఏంటో అందరికీ తెలుస్తున్నాయని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. సమాజం కోసం బ్రతికిన మహానుభావులు పొట్టి శ్రీరాములు అని వ్యాఖ్యానించారు పవన్ కళ్యాణ్.