ఎమ్మెల్యేలకు అసెంబ్లీ అంటే ఒక దేవాలయం : బుద్దా వెంకన్న

-

అసెంబ్లీకి వెళ్లని 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయాలంటూ టీడీపీ నేత బుద్దా వెంకన్న డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేలకు అసెంబ్లీ అంటే ఒక దేవాలయం. ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులుగా ఆయా నియోజకవర్గాల సమస్యలను ప్రస్తావించాలి. 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలు మాత్రం అసెంబ్లీకి రాకుండా ఆ ప్రజలనే అవమానిస్తున్నారు. అసెంబ్లీకి రాకున్నా ఆ 11 మందికి ప్రతినెలా లక్షా 75వేల రూపాయలు వారి ఎకౌంట్లోకి పడుతున్నాయి. ప్రజల గురించి ఒక్కరోజు కూడా అసెంబ్లీలో మాట్లాడలేదు.. అసలు వెళ్లనేలేదు . ఇక నుంచి ఆ 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలను మేము మేకలుగా పరిగణిస్తాం.

వైసీపీలో 11 మంది మేకలు ఉన్నాయి.. ప్రజాధనాన్ని శుభ్రంగా మేస్తున్నాయని చెప్పాల్సి ఉంది. వారిలో ఒక పెద్ద మేక ఉంది… ఎప్పుడు ఏం మాట్లాడతారో, ఏం చెబుతారో తెలియదు. గతంలో సీఎం గా పని చేసిన ఆ వ్యక్తికి ప్రజలు తగిన బుద్ది చెప్పడంతో.. బెంగుళూరుకు పారిపోయారు. ప్రజల సమస్యలను పరిష్కరించాలని మిమ్మలను ఎమ్మెల్యేగా గెలిపించారు. అసెంబ్లీకి వెళ్లని మీకు ఎమ్మెల్యేలుగా కొనసాగే అర్హత లేదు.. వెంటనే రాజీనామా చేయాలి అని బుద్దా వెంకన్న సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news